పెరిగిన మద్యం విక్రయాలు
సత్యసాయి: జిల్లాలో గడిచిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాల ప్రకారం జిల్లాలో ఐఎంఎల్ విక్రయాల్లో 56 శాతం, బీర్ల విక్రయాల్లో 94 శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది రూ. 571.94 కోట్లుగా ఉన్న మద్యం విక్రయాల విలువ ఈ ఏడాది ఏకంగా రూ. 768.03 కోట్లకు చేరింది.