సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

NGKL: పీఎం కిసాన్ నిధులు/ రైతు భరోసా నిధులు జమ చేస్తామని వచ్చే ఫేక్ ఫోన్‌కాల్స్, లింక్స్, మెసేజ్, యాప్స్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని శనివారం జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనివారికి చెప్పవద్దని కోరారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.