VIDEO: రిచా ఘోష్‌కు ఘన స్వాగతం
వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత మహిళా జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా, వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్‌కు తన హోమ్ టౌన్ అయిన పశ్చిమ బెంగాల్‌లో అభిమానులు భారీగా స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ జీప్‌పై ఆమె ప్రయాణిస్తుండగా, రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో అభిమానులు చేరుకుని ఆమెతో ఫొటోలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది.