VIDEO: జిల్లాలో భారీ వర్షం

GNTR: జిల్లా వ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. అయితే, వాహనదారులు, పాదచారులు, వీధి వ్యాపారులు మాత్రం ఇబ్బందులు పడ్డారు. ఉరుములు, మెరుపుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.