తాళం వేసిన ఇంట్లో చోరీ.!
KDP: సిద్ధవటం(మం) మాధవరం-1లోని రోడ్డు నంబర్ 12లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. ఇంటి యజమానులు నెల్లూరులోని ఓ కార్యక్రమానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. బీరువాలోని వెండి నగలు, డబ్బులు అపహరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్ధవటం ఎస్సై హారిక వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.