ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు
E.G: రాజానగరం మండలం వెలుగుబంధ గ్రామంలో 'మన ఊరు- మన ఎమ్మెల్యే', 'మన పల్లె బాట' కార్యక్రమంలో భాగంగా రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ ఇవాళ ఉదయం 9 గంటల నుంచి పర్యటించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో పర్యటిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ సమస్యలు తెలియజేస్తే వాటి పరిష్కారానికి MLA చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది తెలిపింది.