కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా మహేందర్ రెడ్డి

కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా మహేందర్ రెడ్డి

MHBD: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని అమీనాపురం గ్రామానికి చెందిన డీసీసీ ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి నియామించబడ్డారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. నాపై నమ్మకంతో పదవి అప్పగించినందుకు పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని మహేందర్ రెడ్డి తెలిపారు.