యుద్ధం వేళ ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు

యుద్ధం వేళ ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలను నిర్వహించింది. సముద్రంలోని ఓ యుద్ధ నౌక నుంచి తన తీరానికి సమీపంలోని దీవులపై క్రూజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ పరీక్షలను ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, తన కుమర్తె కిమ్ జు యేతో కలిసి వీక్షించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అమెరికా-దక్షిణ కొరియా వార్షిక సైనిక విన్యాసాలకు ప్రతిగా ఈ పరీక్షలను చేసినట్లు సమాచారం.