'మద్యం విక్రయిస్తే సమాచారం ఇవ్వాలి'

VZM: భోగాపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల మద్యం దుకాణాలు, బార్లు ఆదివారం మూసివేస్తున్నామని సీఐ రవికుమార్ తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఆంక్షలు విధిస్తున్నట్లు ఆయన చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైనా అమ్మకాలు సాగిస్తే 14405 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.