VIDEO: కలుషిత నీటి సమస్యపై ప్రజల ఆందోళన

VIDEO: కలుషిత నీటి సమస్యపై ప్రజల ఆందోళన

ప్రకాశం: కంభం పట్టణంలోని స్థానిక అర్బన్ కాలనీలో శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుళాయిల్లో వచ్చే నీటిలో మట్టి లాంటి అవశేషాలు కనిపిస్తున్నాయని వారు తెలిపారు. ఈ సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఇప్పటివరకు సరైన చర్యలు చేపట్టలేదని కాలనీ వాసులు వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.