నేడు కెజీబీవీలో మెగా పేరెంట్స్ మీటింగ్

VZM: కొత్తవలస(M) తుమ్మీకాపల్లి వద్ద ఉన్న కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో మెగా పేరెంట్స్ , టీచర్స్ నేడు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ విజయకుమారి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందన్నారు. ఇదే విద్యాలయంలో రెండుసార్లు అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో జిల్లా కలెక్టర్ బుధవారం పరిశీలించి, ఆడిటింగ్ నివేదిక ఇవ్వాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.