చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీడీవో

ప్రకాశం: పీసీపల్లి మండలం గుదేవారిపాలెంలోని చెత్త సంపద కేంద్రాన్ని శుక్రవారం ఎంపీడీవో హనుమంతరావు పరిశీలించారు. చెత్త సంపద కేంద్రంలో వర్మీ చేయాలని తెలియజేశారు. షెడ్ నందు తిప్పతీగ వేయాలని, తొట్లు నందు తడి చెత్త పొడి చెత్త వెయ్యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎస్ సౌజన్య, గ్రీన్ అంబాసిడర్లు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.