VIDEO: పత్తి కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో
ATP: గుత్తిలో పత్తి రైతులు రోడ్డెక్కి బుధవారం రాస్తారోకో చేశారు. పలు వాహనాల్లో పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. సీసీఐ అధికారులు ఏడు మంది రైతుల పత్తి నాణ్యతగా లేదని కొనుగోలు చేయడానికి తిరస్కరించారు. దీంతో రైతులు వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రోడ్డుపై వాహనాలను ఉంచి రాస్తారోకో చేశారు.