ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరికరాలు అందజేత

ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరికరాలు అందజేత

NLR: పొదలకూరు మండలంలోని మహ్మదాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బుధవారం హైదరాబాద్‌కు చెందిన అవేర్ గ్రూప్ వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో సుమారు లక్ష రూపాయల విలువచేసే వైద్య పరికరాలను అందజేశారు. హైడ్రాలిక్ బెడ్ కాట్, వీల్ చైర్స్ 2, ఆపరేషన్ థియేటర్ టేబుల్, స్టాండింగ్ బీపీ ఆపరేటివ్ పరికరం, సాధారణ బెడ్ కాట్స్ 2ను అందజేశారు.