చెరువు పొంగి.. 30 ఎకరాలు నీట మునిగిన వరి పంట

చెరువు పొంగి.. 30 ఎకరాలు నీట మునిగిన వరి పంట

SRD: నారాయణఖేడ్ మండల వెంకటాపూర్ గ్రామ శివారులోని పెద్ద చెరువు అలుగు పొంగిపొర్లుతోంది. సోమవారం తెల్లవారుజామున వరద ఉధృతి మరింత పెరగడంతో అలుగు నుంచి దిగువకు పారిన వరద నీరంతా పక్కనే ఉన్న పంట పొలాల్లోకి పొర్లాయని స్థానిక రైతులు మల్గొండ, బ్రహ్మం, సాయిలు, గోపాల్ తెలిపారు. దీంతో దాదాపు 30 ఎకరాలు వరి పంట పొలాలు నీట మునిగి చెరువుల తలపించాయని చెప్పారు.