కిల్లోగూడలో పోలీసుల సెర్చ్ ఆపరేషన్

కిల్లోగూడలో పోలీసుల సెర్చ్ ఆపరేషన్

ASR: డుంబ్రిగూడ మండలం కిల్లోగూడ గ్రామంలో ఆదివారం CASO సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అరకు సీఐ ఎల్. హిమగిరి, డుంబ్రిగూడ ఎస్ఐ ఎల్. సురేష్ ఆధ్వర్యంలో APSP సిబ్బంది, డ్రోన్ సహకారంతో ఈ తనిఖీలు చేపట్టారు. గ్రామంలోని 82 ఇళ్లను పరిశీలించి, అనుమానాస్పద వాహనాల రికార్డులను తనిఖీ చేశారు. గతంలో గంజాయి కేసుల్లో ఉన్న వారి ఇళ్లను సోదాలు నిర్వహించారు.