కుల బహిష్కరణ.. పెద్ద మనుషులపై కేసు నమోదు
SRCL: కుల బహిష్కరణ చేసిన పెద్ద మనుషులపై కేసు నమోదు చేశామని తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. తంగళ్ళపల్లి మండలం సారంపల్లిలో బాలసాని రమేష్ గౌడ్ యొక్క 6 గుంటల భూమిని గౌడ సంఘానికి ఇవ్వమనగా రమేష్ గౌడ్ ఇవ్వకపోవడంతో అతనిని కుల పెద్ద మనుషులు కులం నుంచి బహిష్కరించాలన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.