కొలిమిగుండ్లలో పర్యటించిన బీసీ ఇందిరమ్మ
NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. గ్రామానికి చేరుకున్న బీసీ ఇందిరమ్మకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. టీడీపీ నాయకుడు రామచంద్రారెడ్డి ఆహ్వానం మేరకు బీసీ ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వారు ఆమెను ఘనంగా సన్మానించారు.