పెదకాకానిలో పొగాకు రైతుల ఆందోళన

GNTR: పెదకాకాని వేర్‌హౌస్‌లో పొగాకు కొనుగోలు తక్కువగా జరగడంతో మంగళవారం రైతులు నిరసన వ్యక్తం చేశారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాధం మాట్లాడుతూ.. ఇప్పటివరకు కేవలం 2887 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు కాగా, వాటిలో ఎక్కువభాగం తక్కువ ధరలకే తీసుకున్నారని, రైతులు తెచ్చిన బేళ్లలో రకాలుగా తిరస్కరించడం వల్ల ఆర్థిక నష్టం కలుగుతోందన్నారు.