'మండల స్థాయి SGF క్రీడల ప్రారంభం'

'మండల స్థాయి SGF క్రీడల ప్రారంభం'

BHPL: చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) క్రీడలను MEO రఘుపతి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీస్తాయని, శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, చదువులో ఒత్తిడిని అధిగమించేందుకు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.