'కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

'కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

ప్రకాశం: ఎర్రగొండపాలెం మండలం గంగపాలెంలోని ఇండస్ట్రియల్ పార్క్‌ను రేపు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో పెద్దారవీడు మండల శ్రేణులు తరలిరావాలని టీడీపీ మండల కన్వీనర్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చెందుతుందని సోమవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.