6 పోస్టులకు నోటిఫికేషన్

NLR: కందుకూరు బాలసదనంలో ఖాళీగా ఉన్న పలు పోస్టులకు ఐసీడీఎస్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. హెల్పర్ నైట్ వాచ్మెన్-2, హౌస్ కీపర్-1, ఎడ్యుకేటర్-1, యోగా టీచర్-1, మ్యూజిక్ టీచర్-1 పోస్టులను ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం పద్ధతిన భర్తీ చేస్తామని చెప్పారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.