రహదారిపై గుంతలతో ఇక్కట్లు

రహదారిపై గుంతలతో ఇక్కట్లు

NZB: ధర్‌పల్లి మండల కేంద్రంలోని గాంధీ చౌక్‌లో భారీ వర్షాలకు ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి. దీంతో నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గుంతల్లో నీళ్లు నిలిచి ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గుంతలకు వెంటనే మరమ్మతులు చేయించాలని వారు కోరుతున్నారు.