‘సగం బాలీవుడ్ అమ్ముడుపోయింది’

బాలీవుడ్ నటీనటులను ఉద్దేశించి ప్రకాష్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాజకీయ అంశాలపై బాలీవుడ్ ప్రముఖులు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'బాలీవుడ్‌లో సగం మంది అమ్ముడుపోయారు. ఇక మిగిలిన వారికి మాట్లాడే ధైర్యం లేదు' అని విమర్శించాడు. కాగా, ప్రకాష్‌రాజు వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.