VIDEO: చిన్నారికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపిన డిప్యూటీ సీఎం
CTR: మొన్న జరిగిన పవన్ కళ్యాణ్ గారి కుంకి ఏనుగుల కార్యక్రమం చూసి, ఆయనను ఆశీర్వదిస్తున్న దృశ్యాన్ని చిత్రంగా ఆవిష్కరించిన చిన్నారి హిరంశీ ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆ వీడియోను గమనించిన ఉప ముఖ్యమంత్రి చిన్నారి సృజనాత్మకతను మెచ్చి ప్రత్యేక బహుమతి చిన్నారికి పంపించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది.