'పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం'

'పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం'

SKLM: జిల్లా హోంగార్డు యూనిట్‌కు చెందిన హోంగార్డు సింగూరు రాజేశ్వరరావు ఆర్మ్డ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మహేశ్వర రెడ్డి రాజేశ్వరరావు సతీమణి సింగూరు లక్ష్మీకి హోంగార్డుల ఒక రోజు దినసరి వేతనం మొత్తం రూ.4లక్షల 4 వేల నగదు చెక్కును అందజేశారు.