‘పిల్లల్లో నులి పురుగుల నివారణకు ఆల్బండజోల్ మాత్రలు వేయాలి’

SRPT: పిల్లల్లో నులి పురుగుల నివారణకు ఆల్బండజోల్ మాత్రలు తప్పని సరిగా వేయాలని పెన్‌పహాడ్ మండల తాసీల్దార్ లాలూ నాయక్, MPDO జానయ్య, వైద్యాధికారి రాజేశ్ అన్నారు. సోమవారం జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో కస్తూరిభా గాంధీ బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.