అగ్ని ప్రమాదంలో వృద్ధురాలికి తీవ్రగాయాలు

అగ్ని ప్రమాదంలో వృద్ధురాలికి తీవ్రగాయాలు

VZM: రాజాం మండలం విజయరాంపురం గ్రామంలో ఇవాళ తెల్లవారుజామున పూరిగుడిసె ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలు అంటుకోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న లింగాల పైడమ్మ (74) తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వృద్ధురాలని గ్రామస్థులు చికిత్స నిమిత్తం 108లో రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పూరిగుడిసె పూర్తిగా దగ్ధమైంది.