VIDEO: ఆకట్టుకున్న చిన్నారుల చిత్రలేఖనం పోటీలు
AKP: నర్సీపట్నం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం సాయంత్రం వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. పిల్లలలో సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు పోటీలు నిర్వహించినట్టు డాక్టర్ మల్లికార్జున పేర్కొన్నారు. విజేతలకు నగదు బహుమతితో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి మేమెంటో, పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇస్తున్నామని తెలిపారు.