పోటెత్తిన భక్తులు.. నిలిచిన వాహనాలు
NGKL: లింగాల మండలం సలేశ్వర జాతరకు భక్తులు పోటెత్తారు. ఘాట్ రోడ్డు కావడంతో నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మననూరు నుంచి ఫర్హాబాద్ చౌరస్తా వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి భక్తుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. అటవీ, పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు తిప్పలు పడుతున్నారు.