'పరిసరాల పరిశుభ్రతకు కృషి చేయాలి'

'పరిసరాల పరిశుభ్రతకు కృషి చేయాలి'

KKD: దేవరపల్లి మండల పరిషత్ కార్యాలయం నందు శనివారం స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా దేవరపల్లి ఎంపీపీ కేవీకే దుర్గారావు మాట్లాడుతూ గ్రామంలో పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సిహెచ్ నాగార్జున్ రావు, డిప్యూటీ ఎంపీడీవో సత్యనారాయణ, ఉపాధి హామీ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.