మండలంలో పోలీసుల విస్తృత తనిఖీలు
VZM: దత్తరాజేరు మండలంలో గురువారం పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. పెదమానాపురం వద్ద ఎస్సై జయంతి వాహనాలను చెక్ చేసి ఇన్సూరెన్స్ లేని 15 మందిపై జరిమానాలు విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం జాగ్రత్తలు పాటించాలని, మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.