కాల్‌మనీ పేరుతో బెదిరిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

కాల్‌మనీ పేరుతో బెదిరిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

VZM: జిల్లాలో కాల్‌మనీ వ్యాపారం నిర్వహిస్తూ ప్రజలను అధిక వడ్డీ రేట్లతో వేధిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గురువారం హెచ్చరించారు. కాల్‌మనీ పేరుతో సాధారణ ప్రజలను మోసం చేయడం, అధిక వడ్డీలు వసూలు చేయడం, అప్పు తీసుకొన్న వారిని బెదిరించడం ఆస్తులను జప్తు చేయడం చట్టవిరుద్ధం అని ఎస్పీ తెలిపారు. ప్రజలు డయల్ 100కు ఫిర్యాదు చేయాలన్నారు.