'గోమాతను జాతీయ జంతువుగా చేయాలి'
MBNR: గండీడ్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు గోమాతను జాతీయ జంతువుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గోహత్యను పూర్తిగా నిషేధించి, గోవంశ సంరక్షణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ అంశాలపై ఈ నెల 27న తహసీల్దార్కు వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మల్కయ్య, నరహరి రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.