'మూడు రోజులు భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండండి'

'మూడు రోజులు భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండండి'

MBNR: రాబోయే మూడు రోజులు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయం నుంచి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇండ్ల నుంచి బయటకు రాకూడదన్నారు. వాగులు వంకల వైపు వెళ్లి సెల్ఫీలు తీసుకోకూడదన్నారు. వాగులను దాటేందుకు ప్రయత్నం చేయకూడదన్నారు.