అధికారులతో అదనపు ఈవో సమన్వయ సమావేశం

అధికారులతో అదనపు ఈవో సమన్వయ సమావేశం

TPT: టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సోమవారం ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. భక్తుల భద్రత, రవాణా, పార్కింగ్ అంశాలపై చర్చించామని తెలిపారు.