శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం ఎంతంటే?

KNL: శ్రీశైలం జలాశయంకు జూరాల,సుంకేసుల జలాశయాల నుంచి ఇన్ప్లే 16,917క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుంది. జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 880.40అడుగులు ఉంది. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 190.3330 టీఎంసీలుగా నమోదైంది. జలాశయం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తూ 28,958క్యూసెక్కుల నీరు విడుదల చేసారు.