విద్యానగర్‌లో పర్యటించిన మున్సిపల్ ఛైర్మన్
సత్యసాయి: హిందూపురం పట్టణంలో విద్యానగర్ ప్రాంతంలో మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్ కుమార్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వార్డులో ఉన్న ప్రజలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యానగర్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని, రోడ్లు, కాలువలు నిర్మాణం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు హనుమంతు, శివ తదితరులు పాల్గొన్నారు.