VIDEO: NHAI అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
కృష్ణా: గుడివాడలో ROB పనులు వేగవంతంగా జరిగేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే రాము అన్నారు. ROB నిర్మాణ పనుల పురోగతిపై ఎన్.హెచ్.ఏ అధికారులతో ప్రజా వేదిక కార్యాలయంలో గురువారం ఆయన సమీక్షించారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. రైల్వే గేట్లపై నిర్మాణ పనులు చేపట్టేందుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.