VIDEO: నేలకొండపల్లిలో యువకుల ఘర్షణ
KMM: నేలకొండపల్లి మండల కేంద్రంలో యువకులు కత్తులతో వీరంగం సృష్టించారు. పాత కక్షల నేపథ్యంలో ఒక వర్గం యువకులు మరో వర్గంపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఘర్షణకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.