పొన్నూరులో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు
GNTR: పొన్నూరులో శుక్రవారం మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం సందర్భంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. మార్కెట్ సెంటర్‌లో ఉన్న జెండా చెట్టు వద్ద నిర్వాహకులు సయ్యద్ జైనులావుద్దీన్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.