VIDEO: రోడ్డు ప్రమాదం.. తప్పిన ప్రాణ నష్టం
NRPT: మక్తల్ మండలం గుడెబల్లూర్ శివారులో స్కార్పియో కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. కర్ణాటకకు చెందిన బాధితులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న సర్పంచ్, స్థానిక యువకులు వెంటనే స్పందించి కారును బయటకు తీశారు. డ్రైవర్, యజమానికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.