VIDEO: లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన అధికారి
ASF: జిల్లాలో పౌర సరఫరాల మేనేజర్ నర్సింగరావు రూ.75 వేలు లంచం తీసుకోగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దహేగాంలో వాసవి రైస్ మిల్లులో గత నెల 9న 3 లారీలను గుర్తించి అందులో పీడీఎస్ బియ్యం ఉన్నాయని పట్టుకున్న పౌర సరఫరా శాఖ మేనేజర్ రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు చేశారు. లారీ రిలీజ్ చేయడానికి రూ.75వేలు లంచం అడగడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.