కరెంట్ షాక్ తగిలి మహిళ మృతి

SRD: న్యాల్కల్ మండలం హుస్సేన్నగర్‌లో ఆదివారం ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో ఓ మహిళ మృతి చెందినట్లు హద్నూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. గ్రామానికి చెందిన సిద్ధమ్మ ఆదివారం బాత్రూంకు వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు రేకులకు చేయి తగలడంతో షాక్ తగిలి కిందపడడంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు.