VIDEO: పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి: CPI
KRNL: రైతులు పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో బుధవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఏపీ రైతు సంఘం నగర కార్యదర్శి జగన్నాథం మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు నకిలీ విత్తనాల సంస్థలపై దాడుల నిర్వహించి, రైతులను ఆదుకోవాలని అన్నారు.