శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద

TG: నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ప్రస్తుతం 1.52 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదవుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1088 అడుగులకు చేరింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 71 టీఎంసీల నీరు నిల్వ ఉంది.