ఈనెల 15న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహణ

ఈనెల 15న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహణ

ASF: రాజీమార్గాన కేసుల పరిష్కారం కోసం ఈనెల 15న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి M.V.రమేష్ తెలిపారు. ఈనెల 3న సాయంత్రం 5 గంటలకు ఆసిఫాబాద్ జిల్లా కోర్ట్‌లో పోలీసు శాఖ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా క్రిమినల్, సివిల్, తదితర కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు.