'ఉచిత వైద్యశిబిరం సద్వినియోగం చేసుకోండి'
W.G: వైద్యం చాలా ఖరీదైనదని ఉచిత వైద్య శిబిరాలను స్వదినియోగం చేసుకోవాలని ఆరేడు సర్పంచ్ కట్టెరెడ్డి బ్రహ్మానందం అన్నారు. ఉండి మండలం ఆరేడులో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది. రాజేశ్వరి రామకృష్ణన్ లయన్స్ హాస్పిటల్ వారు వైద్య సేవలు అందించారు. కలిగొట్ల సర్పంచ్ MS,డా. రంగరాజు, రంగప్రసాదరాజు, యువరాజు, అప్పలరాజు, రాము పాల్గొన్నారు.