భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

W.G: భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. అత్యవసర సహాయం కోసం 08816 299181 నంబర్‌ను కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అధికారుల సెలవులు రద్దు చేస్తూ, గజ ఈతగాళ్లను, మోటార్ బోట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజలు సముద్రం, గోదావరి నది వైపు వెళ్లవద్దని ఆమె హెచ్చరించారు.