చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

కోనసీమ: అమలాపురం మండలం ఈదరపల్లి కి చెందిన అధికారి నరసింహమూర్తి(65) ఈ నెల 5 వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అతనిని మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడని పట్టణ ఎస్సై టి.శ్రీనివాస్ సోమవారం తెలిపారు. మద్యం తాగుతున్నాడని కుటుంబసభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.